ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా..అన్నారు !

  • 7 years ago
Colours Swathi speaking about When She met Krishna vamshi for danger Movie Screan test

ప్రస్తుతానికి అటు టాప్ రేంజ్ కాకుండా, ఇటు ఖాళీగా లేకుండా తన రేంజ్ లో కొంత బిజీగానే ఉంది కలర్స్ స్వాతి. ఓ ఛానల్లో వచ్చిన క‌ల‌ర్స్ ప్రోగ్రామ్‌తో బల్లితెర మీద‌ సూప‌ర్ పాపుల‌ర్ అయిన స్వాతి ఆ త‌ర్వాత వెండితెర మీద‌కు రంగ ప్ర‌వేశం చేసింది. కృష్ణ‌వంశీ రూపొందించిన డేంజ‌ర్‌ ఆమెకు తొలి సినిమా.
ఆ సినిమా కంటే ముందు "గంగోత్రి"లో అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అయితే చ‌దువు మ‌ధ్య‌లో ఉంద‌న్న కార‌ణంతో ఆ సినిమాను స్వాతి తిర‌స్క‌రించింది. ఆ త‌ర్వాత కృష్ణ‌వంశీ "డేంజ‌ర్‌" సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సంద‌ర్భంగా కృష్ణ‌వంశీతో జ‌రిగిన సంభాష‌ణ‌ను తాజా ఇంట‌ర్వ్యూలో పంచుకుంది.
"డేంజర్ సినిమా అవకాశం వచ్చినపుడు నేను మా అమ్మ కలిసి కృష్ణవంశీ గారి ఆఫీసుకి వెళ్లాం. అక్కడ ఆయన గదిలో కూర్చుని ఉన్నారు. వెళ్లగానే స్క్రిప్టు చెబుతారా అని అడిగాం. ఆయన ఒక తెల్ల కాగితం తీసుకుని దానిపై పెన్నుతో కేవీ అని రాశి మా వైపు తోశారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అని అడిగారు.
మా అమ్మ వెంటనే.. "మీరేం సినిమాలు తీశారండీ" అని అడిగింది. మేం ఆయన తీసిన నిన్నే పెళ్లాడతా, మురారి చూసి ఉన్నప్పటికీ ఆయనే కృష్ణవంశీ అని తెలియదు. నన్నే ఇలా అడుగుతారా అంటూ ఆయన కొంచెం కోప్పడ్డారు. ముందు నువ్వు నటించగలవో లేదో నీకు స్క్రీన్ టెస్టు చేస్తా అన్నారు.

Recommended