మనకు సిగ్గులేదు, ఏంటో ఈ ఖర్మ? మాధవీలత ఫైర్

  • 7 years ago
Nacchavu le Madhavi Latha fires on our political system, she posted a satire on her Facebook wall about Ivanka Trump visit To India

ఇవాంకా ట్రంప్ గత వారంరోజులుగా హైదరాబాద్ మొత్తం మారుమోగుతున్న పేరు. అసలు ఇవాంకా వచ్చిన సందర్భానికీ, టాలీవుడ్‌కీ ఏ సంబందం లేకపోయినా ఆమె రాకవల్ల ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా అందరూ ఏదో ఒక రకమైన స్పందన తెలియజేస్తున్నారు. కొన్ని అభినందనలూ, మరికొన్ని నిరసనలూ కలిపి మొత్తానికి ఇవాంకా రాక వల్ల చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు... ఇప్పుడు మాధవీలత (నచ్చావులే ఫేమ్) కూడా ఇవాంకా రాక మీద ఒక సెటైర్ వేసింది. అయితే ఇది మన ప్రభుత్వాన్నీ, జనం లోఉన్న నిర్లక్ష్యాన్నీ ఉద్దేశించి చేసిందే...
హైదరాబాద్‌ కు ఇవాంకా ట్రంప్ వస్తుండడంతో ఇంత హడావిడి. ఆమె వెళ్లే ప్రాంతాల్లో క్లీనింగ్, పెయింటింగ్ చేశారు. బాగుంది. మరి అమెరికాకు మన అధినేతలు వెళ్తే వాళ్లేమీ కొత్తగా చేయరు. ఎందుకు? అంటే వారికి మర్యాదలు చేయడం తెలియకా? లేక రాకా? కాకపోతే అలా హడావుడి చేయాల్సిన అవసరం వారికి లేదా?
అదీకాకపోతే అక్కడ ప్రజలందరికీ ఒకే తరహా రోడ్లు ఉన్నాయా? అంటే దీని అర్ధం మనం ఇంకా చాలా డెవలప్‌ మెంట్ అవ్వాల్సి ఉందని అర్థమైంది కదా! ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అతిథి కోసం కాకుండా ప్రజల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అవెప్పుడూ అలాగే ఉండాలి' అంటూ ఆకాంక్షించింది.

Recommended