Hyderabad Metro Launch : Modi Flags Off Rail Service, Takes Ride Watch

  • 7 years ago
Prime Minister Narendra Modi today inaugurated the Hyderabad Metro at the Miyapur station. along with Telangana Chief Minister K Chandrasekhar Rao Modi took the first ride.

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మియాపూర్‌లో హైదరాబాద్ మెట్రో రైలును ఆవిష్కరించారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి మియాపూర్ చేరుకున్న మోడీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మెట్రో పైలాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు బ్రోచర్, యాప్ విడుదల చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులతో కలిసి ప్రధాని మోడీ వీక్షించారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రధాని మోడీ తొలుత ఎయిర్ పోర్టు పార్కింగ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయనని కార్యకర్తలు సన్మానించారు. ఈ సభలో మోడీ తొలుత తెలుగులో మాట్లాడారు. సోదర, సోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించారు. 'హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ విమోచనంలో అమరులైన వారికి జోహార్లు. ఇక్కడకు వస్తే సర్దార్ పటేల్ గుర్తుకు వస్తారు. హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరం. తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అభినందనలు' అని తెలుగులో చెప్పారు.

Recommended