Mega Powerstar Ram Charan to Romance Again With Rakul Preet Singh For hes next Movie in Boyapati srinivas Direction
టాలీవుడ్ లో హిట్ పెయిర్ అనే మాట చాలాకాలం కింద వినిపించేది, కానీ చాలా కాలంగా ఆమాత వినిపించటమే లేదు.. లెక్కకు మించిన హీరోలూ, హీరోయిన్లూ వచ్చి చేరిపోవటం, పక్క ఇందస్ట్రీలనుంచీ వలసలు కూదా పెరుగుతూందటం తో రిపీట్ కాంబినేషన్లు చాలావరకు తగ్గిపోయాయి. కానీ ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు ఒకసారి నటించిన హీరోయిన్ తో మారోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్ట పడటం లేదు. కానీ ఒక్క హీరో మాత్రం బలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అదెవరో కాదు రామ్ చరణ్. ఇప్పటికే రెండు సార్లు చేసిన రకుల్ తోనే ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నడు హీరోయిన్లకు వరుసపెట్టి ఛాన్స్ లు ఇవ్వడం చెర్రీకి కొత్తకాదు. గతంలో కాజల్ విషయంలో ఇదే జరిగింది. మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో చరణ్, కాజల్ కలిసి పనిచేశారు. మగధీర తర్వాత ఓ సినిమా ఆగిపోయింది కానీ లేదంటే ఈ కౌంట్ ఇంకా పెరిగేది. కాజల్ తర్వాత ఇప్పుడు రకుల్ కు అలా వరుసపెట్టి అవకాశాలిస్తున్నాడు చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత చిత్రం బోయపాటి శ్రీను తో చేయడానికి ఫిక్స్ అయ్యాడు. రీసెంట్ గా సినిమా పూజా కార్యక్రమాలు కూడా సింపుల్ గా స్టార్ట్ అయ్యాయి. అయితే ఆ సినిమాలో రకుల్ ప్రీత్ కౌర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. ఇంతకుముందు రకుల్ చరణ్ తో బ్రూస్ లీ- ధృవ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో బ్రూస్ లీ డిజాస్టర్ అవ్వగా దృవ మాత్రం బంపర్ హిట్ అయ్యింది. రిజల్ట్ ఎలా ఉన్నా రెండు సినిమాల్లో వారి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా సెట్ అయ్యింది. దీంతో మరోసారి కూడా కలిసి హిట్ కొట్టాలని చూస్తోంది ఈ కాంబో.