Film "Padmavati" is reportedly insured for Rs 140 crore, of which the distributors can claim about Rs 80 crore if the screening of the film is affected or if the audience is unable to access the theatres. According to reports, the film is warranted in case of a strike, riots and weather-related events but wi
సంజయ్ లీలా బన్సాలీ ఒక ప్రత్యేక శైలి ఉన్న డైరెక్తర్.. ఫ్రేమ్ ని ఎంత లావిష్ గా సెట్ చేసుకోవాలో, ఎంత రిచ్‌గా ఉండాలో బాగా తెలిసిన దర్శకుడు అందుకే ప్రతీ సినిమానీ ఒక ఖళాఖండం చేయాలన్నంత తపనగా పనిచేస్తాడు. ఇక బడ్జెట్ సంగతి చెప్పాల్సిన పనేముంది. వందల కోట్లు దారాళంగా ఖర్చు చేసేస్తాడు... అందుకే ఆ రిచ్‌నెస్ కోసమే దాదాపుగా తన సినిమాల్లో ఎక్కువ భాగం పీరియాడికల్ సబ్జెక్ట్స్ నే తీసుకుంటాడు, ఈ సారికూడా అదే పద్దతిని ఫాలో అవుతూ "పద్మావతి" స్క్రిప్ట్ సిద్దం చేసాడు. అయితే ఊహించనంత వ్యతిరేకత, అసలు అనుకోనంత తీవ్రమైన వివాదం ఈ సినిమాని చుట్టుముట్టింది రెండు రాష్ట్రాలు అధికారికంగానే ఈ సినిమాని బ్యాన్ చేసాయి. మరోవైపు ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సెన్సార్ బోర్డు దగ్గర కూడా సమస్యలు తలెత్తడంతో డిసెంబరు 1 నుంచి ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతే తాను తీసే సబ్జెక్ట్ ఇంతగా వ్యతిరేకతని సంజయ్ లీలా బన్సాలీకి ఎదుర్కుంటుందని ముందే తెలుసా?? ఎందుకంటే ఈ పరిణామాల్ని ముందే ఊహించాడో ఏమో.. బన్సాలీ "పద్మావతి"కి రూ.140 కోట్లకు ఇన్సూరెన్స్ చేసి పెట్టాడు. 180 కోట్ల వ్యయంతో ‘పద్మావతి' రూపొందగా.. రూ.140 కోట్లకు బీమా చేయించడం విశేషం. ఏ రకంగా అయినా ఈ సినిమాకు ఆటంకాలు కలిగినా, ఇది విజయవంతం కాకపోయినా బీమా చెల్లించేలా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం జరిగిందట. అయితే ప్రభుత్వమే నిషేధిస్తే మాత్రం ఈ ఇన్స్యూరెన్స్ వర్తించదు. లీగల్ గా సరైన కారణాలతో సినిమాని ఆపేస్తే ఇన్స్యూరెన్స్ కంపెనీ దాన్ని పరిగణలోకి తీసుకోదన్న మాట. కాబట్టి బన్సాలీ కొంత వరకు సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఏవో కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధించినప్పటికీ.. దేశమంతా ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. మిగతా రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో పద్మావతి బాగానే రాబట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్థికంగా మునిగి పోకుండా తన జాగ్రత్తలో తానున్నాడన్నమాట.