షాకింగ్ న్యూస్.. నిర్మాత బండ్ల గణేష్‌కి జైలు శిక్ష

  • 6 years ago
Film producer Bandla Ganesh sentenced to six months of imprisonment by Erram Manzil Court in a cheque bounce case.

చెల్లని చెక్కు కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష పడింది. 'టెంపర్‌' సినిమాకు సంబంధించి వక్కంతం వంశీ కి ఇవ్వవలసిన రెమ్యునరేషన్ ఎగ్గోట్టే ప్రయత్నం చేయటానికే మోసానికి పాల్పడ్డాడన్న ఆరోపణ , ఉద్దేశ ప్రకారమే చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత ఫిర్యాదు చేయగా, శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది.
వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి.. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించారు. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది.
సినిమావాళ్లు చాలా సార్లు గుట్టుగా ఉండటానికి చూస్తూంటారు. ఏదైనా సమస్య వస్తే తమలో తామే పరిష్కరించుకో చూస్తారు. కానీ అది తమ వల్ల కానప్పుడు ఇదిగో ఇలా విమర్శల వర్షం మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి బహిరంగ విమర్శల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు నిర్మాత బండ్ల గణేష్.
టెంపర్ వివాదం ఒక్కటే కాదు హీరో సచిన్ జోషీతో తీసిన ఆషికీ 2 రీమేక్ "నీజతగా నేనుండాలి" సమయం లో కూడా ఆర్థిక లావాదేవీల విషయం లో పెద్ద గొడవ్బే జరిగింది. చాలా సార్లు ట్విట్టర్ లో గొడవలు పడ్డ వీరిద్దరు మళ్లీ మరోసారి మనసారా బూతులు తిట్టుకోవటం మొదలెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ వివాదం గణేష్ మీద పెద్ద దెబ్బ కొట్టింది.
నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన బండ్ల గణేష్‌ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ‘ఆంజనేయులు' సినిమాతో నిర్మాతగా మారి. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘గబ్బర్‌సింగ్‌', ‘బాద్‌షా', ‘ఇద్దరమ్మాయిలతో', ‘టెంపర్‌' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

Recommended