Both Rajasekhar and Chiranjeevi were at loggerheads for quite some time. But, later,they started meeting at various functions and began greeting each other. They even met in the Memu Saitham programme.
కొన్నేళ్ల కిందట రాజశేఖర్ మీద మెగాస్టార్ అభిమానులు దాడికి ప్రయత్నించటం తో ఇద్దరి మధ్యా దూరం ఏర్పడిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ సంఘటనలో పాల్గొన్నది చిరు అభిమానులు కాదన్నదీ కొందరి వాదన.. అయితే ఎక్కువమంది నమ్మింది మాత్రం అప్పటి ప్రజారాజ్యం పార్టీమీద విమర్శలు చేసినందుకు మెగా అభిమానులే దాడి చేసారని. ఆ ఘటనతో ఒక కోల్డ్ వార్ వాతావరణం రాజశేఖర్, చిరు మధ్యలో చాలాకాలమే ఉండిపోయినా తర్వాత ఇద్దరూ మళ్ళీ కలిసి పోయారు... కానీ ఈ విషయం లో కూడా ఎవరూ పెద్దగా నమ్మలేదు ఆ ఇద్దరిమధ్యా ఆ అభిప్రాయ భేదాలు అలానే ఉండి పోయాయనే అనుకున్నారు... ఐతే ఇటీవల "గరుడవేగ" సినిమా విడుదల నేపథ్యంలో రాజశేఖర్ తన భార్య జీవితలో కలిసి రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన్ని సినిమా చూసేందుకు ఆహ్వానించడంతో ఇరువురి మధ్య ప్యాచప్ అయిందని అందరూ భావించారు. ఐతే తామిద్దరం కొత్తగా కలుసుకున్నదేమీ లేదని.. అంతకుముందే తమ మధ్య విభేదాలు తొలగిపోయాయని రాజశేఖర్ చెప్పాడు. ఐతే ఒకసారి మా అమ్మాయి శివాని మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీలో అప్లై చేశాం. ఆ విషయంలో సపోర్ట్ కోసం జీవిత.. చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్లగానే చిరంజీవి గారు నా గురించి అడిగారట.