Congress President Poll : Congress Announces Schedule | Oneindia Telugu

  • 7 years ago
After holding Congress Working Committee meeting at Congress President Sonia Gandhi’s residence in the national capital, the Congress party on Monday conducted a press conference led by Congress senior leader Mullappally Ramachandran.

పలుమార్లు వాయిదా పడిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం తాజాగా ఖరారైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాహుల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేసింది. సాంకేతికంగా అధికార బదలాయింపు కోసం ఎన్నికలు జరపనుంది. డిసెంబర్‌ 1 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే రాహుల్‌ గాంధీ తప్ప ఇంకేవరూ నామినేషన్‌ వేయకపోతే.. నామినేషన్ల పరిశీలన రోజే రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 5న రాహుల్‌ ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2013లో రాహుల్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, తాజగా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలు చేపడుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Recommended