నా తుది శ్వాస వరకు ఆయన ఆశయాలకు కట్టుబడి ఉంటాను.. - పవన్

  • 7 years ago
JanaSena Party Chief PawanKalyan visited Dr.B.R. Ambedkar memorial before going to the award ceremony

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలను ఇతర దేశాల్లోని సంస్థలు గుర్తిస్తున్నాయి. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న పవన్ కళ్యాణ్ ఇండీ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందించనున్న ఎక్సలెన్సీ అవార్డ్ కి ఎంపికయిన సంగ‌తి తెలిసిందే.
పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను పవన్ ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. నిన్ననే ఇండో-యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు పవన్‌ కళ్యాణ్. బ్రిటన్ పార్లమెంట్ హౌస్‌ ఆఫ్ లార్డ్స్‌లో ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. జనసేన అధినేతగా, ప్రజా సమస్యలపై పోరాడినందుకుగాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
అయితే పవన్ అంబేద్కర్ మెమోరియల్‌ను సందర్శించినపుడు తీసిన పిక్స్‌ను పరిశీలిస్తే ఓ పిక్‌లో ఏదో రాస్తున్నట్టుగా కనిపిస్తుంది. "శ్రీ బాబా సాహెబ్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారు. మా జాతికే గర్వకారణమైన గొప్ప నేత.. ఆయన్ను నేను నిజంగా ఆరాధిస్తాను.. ఆయన్నుంచి ప్రేరణ పొందాను.

Recommended