Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Diabetes is a chronic disease that has reached great proportion among people, the world over. When diabetes is uncontrolled, it can have serious complications such as heart disease, kidney disease, blindness and other complications.

డయాబెటిస్ లేదా షుగర్ లేదా మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచకపోతే అది ఇతర వ్యాధులకు దారి తీస్తుంది. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, అంధత్వంతో పాటు ఇతర సమస్యలు వస్తాయి. మధుమేహం శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, రక్త పీడనాన్ని అధికం చేస్తుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు వారు తీసుకునే ఫుడ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కర స్థాయిలు, కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగితే కాలేయంలోని 'రిసెప్టార్స్' లేదా 'గ్రాహకాలు' చక్కరతో పూత పూయబడతాయి. దీని వలన రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలను బయటకి పంపటంలో కాలేయం తన సామార్థ్యాన్ని కోల్పోతుంది. మధుమేహా వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ స్థాయిలు పెరగటం వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయి. మీకు మధుమేహం వున్నప్పుడు మీరు తీసుకునే ఆహారం చాలా ప్రభావం చూపుతుంది. మీరు మీ డైట్ ను తయారు చేసుకుంటున్నప్పుడు, పిండి పదార్థాలు, ఫైబర్, కొవ్వు అనే కీలక విషయాల మీద దృష్టి పెట్టాలి. అలాగే మధుమేహవ్యాధిగ్రస్తులు అస్సలు తీసుకోకూడని కొన్ని ఆహారాలుంటాయి. మరి అవి ఏమిటో చూద్దామా.

Category

🗞
News

Recommended