బాలీవుడ్ సీనియర్ హీరో సంచలన వ్యాఖ్యలు

  • 7 years ago
Veteran actor Rishi Kapoor said he agrees with National Conference president Farooq Abdullah, who claimed that Pakistan-occupied Kashmir (PoK) belongs to Pakistan and "this won't change" no matter how many wars India and Pakistan fight against each other.

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ పాకిస్థాన్ భజన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్ దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పాకిస్థాన్‌కే చెందుతుంది... పాక్, భారత్ మద్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఇందులో మార్పుండదని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ట్వీట్ చేశారు.
పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. స్పందించారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా... " ఫరూక్ అబ్దుల్లా గారు, నమస్కారం. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా.
జమ్ముకశ్మీర్ మనది. పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) వారిది. ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం. నా వయసు 65 ఏళ్లు. చనిపోయేలోగా పాకిస్థాన్ ను చూడాలనేది నా కోరిక. జై మాతా దీ", అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద ట్వీట్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.
రిషికపూర్ పూర్వీకులు పాకిస్థాన్‌లో పెషావర్‌లో ప్రాంతంలో నివసించేవారు. 1918- 22 మధ్య కాలంలో ఆయన తాత దేవాన్ బశేశ్వర్‌నాథ్ కపూర్ అక్కడ ఓ భవంతిని నిర్మించారు. అయితే రిషి తండ్రి పృథ్వీరాజ్ క‌పూర్‌ సినీ రంగంలోకి రావడం, 1947 విభజన తర్వాత ఇండియాకు వచ్చేశారు.

Recommended