Naga Chaitanya Akkineni and Samantha entered the wedlock on October 6th in a grand manner at Goa. Now, the Akkineni family took a decision to host a grand reception for the Tollywood film industry in Hyderabad. The family is planning to host the event in Hyderabad on 12th November at N Convention. అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6వ తేదీన గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వేర్వేరుగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయింది కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం పెట్టుకోలేదు. చైతన్య, సమంత తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. ఇక ఈ పెళ్లి వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా జరుడంతో గెస్టులను కూడా పరిమిత సంఖ్యలో పిలవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. కాగా నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ డేట్ ఖరారైంది. నవంబర్ 12వ తేదీన వీరి వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరూ ఈ తేదీన ఎలాంటి షూటింగులు లేకుండా ఫ్రీగా ఉండటంతో ఈ డేట్ ఫిక్స్ చేశారు. నాగార్జున తన హోదాకు తగిన విధంగా ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.