Skip to playerSkip to main content
  • 8 years ago
Peddi Reddy warns cm kcr at Kodandaram's 24-hour protest event in Kodandaram's house. Watch Video For his Speech
అధికారం నుంచి తొలగిస్తాం.. పెద్దిరెడ్డి హెచ్చరిక
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపణలు చేస్తూ మరో ఉద్యమానికి ప్రొఫెసర్ కోదండరాం సిద్ధమయ్యారు. పోరాటంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించటానికి పూనుకొన్నాడు. కానీ సభ నిర్వహించుకొనేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయనను పోలీసులు అడ్డుకొన్నారు. దాంతో బుధవారం తార్నాకలోని తన నివాసంవద్దనే ఆయన ధర్నాకు కూర్చున్నారు.
టీడీపీ నాయకులు పెద్ది రెడ్డి మాట్లాడుతూ.. కోదండరాం ఎందుకు కోట్లాడుతున్నడో కేసీఆర్ తెలుసుకోవాలి. తొలి దశ ఉద్యమంలో కేసీఆర్ లేడు, మలి దశలో కూడా లేడు, ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చాడో అందరికి తెలుసు. పొలిటికల్ జేఏసీ వల్లనే ఈ రోజు తెలంగాణా అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి.ప్రస్తుతం అధికారంలో ఉన్న నీకు పోలీసులు అండగా ఉన్నారు. అధికారం అనుభవిస్తూ ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? ఈ రోజు కోదండరాం ఎందుకు అంటరానివాడు అయ్యారు.? ప్రాణాలు పోగొట్టుకున్న యువత ఈ రోజు నీకు ఎందుకు గుర్తు రావటం లేదు.? నువ్ ఇంకా అందరిని తక్కువ చేస్తే నిన్ను అధికారం నుండి తొలగిస్తారు గుర్తుపెట్టుకో అని ఆయన హెచ్చరించారు. లక్ష ఇరవై వేల ఉద్యోగాలను వెంటనే ప్రకటించాలి అని పెద్దిరెడ్డి డిమాండ్ చేసారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended