Skip to playerSkip to main contentSkip to footer
  • 8/11/2017
https://vimeo.com/229256990
https://www.dropbox.com/sh/s2xsrnsz6yzh81r/AADqDcLNesGxskkyuDzAc8FBa?dl=0
మరణం నను వరించి వస్తే
యేమంటాను నేనేమంటాను
పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను

లంచం నను భజించి వస్తే
యేమంటాను నేనేమంటాను
తిరుమలగిరి హుండిలో చొరపడమంటాను

కామం నను కలవర పెడితే
యేమంటాను నేనేమంటాను
అలిగిఉన్న పడుచు జంటతో కలపడమంటాను

క్రోధం నను కవ్విస్తుంటే
యేమంటాను నేనేమంటాను
పసచచ్చిన పేడిజాతిలో బుసలిడమంటాను

లోభం నను ఉలిపిస్తుంటే
యేమంటాను నేనేమంటాను
తెగవొలికే కవిపలుకుల్లో దిగబడమంటాను

అహంకారమెదురై వస్తే
యేమంటాను నేనేమంటాను
నరునివదలి కొండనెత్తిలో స్థిరపడమంటాను

కాలం పులిలా గాండ్రిస్తే
యేమంటాను నేనేమంటాను
దిగులెందుకు ఓయిసినారే తెగపడమంటాను

Category

🎵
Music

Recommended