Skip to playerSkip to main contentSkip to footer
  • 8/11/2017
6.Yevo Yevo Baadalu Barinche Mooga Jeevitam_TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY
యేవో యేవో బాధలు
భరించె మూగ జీవితం
ఎన్నో ఎన్నో గీతలు
ధరించె తెల్లకాగితం
1.సుతకోటి హితకోటి వున్నా
గత వైభవం చాటుతున్నా
ఎంతో ఎంతో వేదనా
సహించే మాతృ భారతం
2. చిరునవ్వు జలతారు లున్నా
సరదాల రహదారులున్నా
అవునా అవునా లోకమే
అనంత శోక పూరితం
3. పొరలేని తత్వార్థమున్నా
దివిలోని వృత్తాంతమైనా
అయినా అయినా కావ్యమే
అనూన్న కల్పనామృతమ్
4. తన గొంతు తడి ఆరుతున్నా
మునుముందు యే కొండలున్నా
ఏరై పారే జాతికే
సినారె గీతి అంకితం

Category

🎵
Music

Recommended