Skip to playerSkip to main content
  • 8 years ago
Celebrations were on at Harmanpreet Kaur’s home in Moga in Punjab after her 171-run knock against Australia -- one of the greatest ODI knocks in women’s cricket


ఏం చెప్పగలం ఆ విధ్వంసాన్ని.. ఎంతని పొగడగలం ఆ పరాక్రమాన్ని.. ఎలా వర్ణించగలం ఆ ధీరత్వాన్ని.. ఆడుతోంది అమ్మాయేనా.. చూస్తోంది మహిళల మ్యాచేనా.. అన్న అనుమానం కలిగేలా.. ఆస్ట్రేలియాపై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సివంగిలా సింహనాదం చేసింది. హర్మన్‌ప్రీత్‌ను ఎంత పొడిగినా తక్కువే. ఆమె లాగిపెట్టి సిక్స్‌ కొట్టినా అందమే. లాఘవంగా డ్రైవ్‌ చేసినా అందమే! మామూలు బ్యాటింగా అది! మళ్లీ బంతి దొరకదేమో అన్నంత కసిగా ఆడింది. ఆమె ఐదో గేర్లోకి మారాక బంతెప్పుడూ బౌండరీ లైన్‌ దగ్గరే. పవర్‌ హిట్టింగ్‌తో ఆమె ఆడిన ఇన్నింగ్స్‌ అభిమానులకు ఎంతో అపురూపం

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended