Advertising Console

    ETV2 సఖి కుటుంబంతో పాటు 7వ వార్షికోత్సవ సంబరాల్లో

    Repost
    nallamothu

    by nallamothu

    24
    218 views
    ETV2 సఖి తెలుగు వారందరీ ఆదరణను చూరగొని 7వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా సఖి కుటుంబంలో నేనూ ఒక సభ్యునిగా నా అభిప్రాయాన్ని చెప్పడం సంతోషంగా ఉంది. గత నాలుగు నెలలుగా సఖిలో నా రెగ్యులర్ ప్రోగ్రాములు వస్తున్న నేపధ్యంలో ప్రతీసారీ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత సఖుల నుండి టెక్నికల్ సందేహాల కోసం అనేక ఫోన్లు వస్తుంటాయి. కొందరి సమస్యలు విన్నప్పుడు బాధేస్తుంది. నాకు తెలిసినంతలో ఎంతో కొంత సహాయపడడానికి ప్రయత్నిస్తాను. అలాంటి ఎన్నో అనుభవాల నుండి సఖి వార్షికోత్సవ సందర్భంలో ఓ అనుభవాన్ని ఇలా వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా పంచుకుంటున్నాను. సఖి ఎక్స్ పర్ట్స్ విభాగంలో పద్మజ గారి తర్వాత రెండవ స్థానంలో ప్రసారం అయిన నా అభిప్రాయాన్ని ఈ క్రింద వీడియోలో మిత్రులతో పంచుకుంటున్నాను.

    - నల్లమోతు శ్రీధర్
    ఎడిటర్
    కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక