IPL 2019 : Chennai Super Kings Continue With Their Winning Ways || Oneindia Telugu

  • 5 years ago
Chennai Super Kings consistently wins the big moments, finds the right men for the occasion, possesses several match-winners.Not for nothing is CSK a serial winner in the IPL. In this edition, the rollicking side already has one foot in the play-offs after its seventh win.
#ipl2019
#chennaisuperkings
#kolkataKnightRiders
#msdhoni
#dineshkarthik
#imrantahir
#chrislynn
#sureshraina

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో చెన్నై ఈ సీజన్‌లో ఏడవ విజయాన్ని నమోదు చేసి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై మరో విజయం తన ఖాతాలో వేసుకుంటే.. ప్లే అఫ్ కు అర్హత సాధిస్తుంది. లీగ్ దశలో చెన్నైకి ఇంకా 6 మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి ప్లే అఫ్ కు వెళ్లడం లాంఛనమే.162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. గర్నే వేసిన 3వ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ వాట్సన్ (6) ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ డుప్లెసిస్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అయితే సునీల్ నరైన్ వేసిన ఆరో ఓవర్ మూడో బంతికి డుప్లెసిస్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Recommended