Asia Cup 2018 : Mushfiqur Rahim Joins Virat Kohli, Younis Khan In List

  • 6 years ago
Mushfiqur Rahim played a whirlwind knock of 144 off 150 balls to dig Bangladesh out of a precarious position in the Asia Cup 2018 tournament opener against Sri Lanka on Saturday at the Dubai International Cricket Stadium, Dubai.
#AsiaCup2018
#MushfiqurRahim
#Bangladesh
#ViratKohli
#YounisKhan


బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లా క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ 150 బంతుల్లో 144 పరుగులు సాధించాడు.
ఫలితంగా ఆసియా కప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2012లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ (144 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Recommended