కిచెన్‌లో ప్రత్యక్షమైన భారీ కొండచిలువ
  • 6 years ago
Thirty-five-year-old Suman Gautam, who was puttering in her kitchen to make tea early on Wednesday morning, was jolted out of her reverie when spotted a five-foot-long, male, Indian Rock Python coiled up in her kitchen. When the incident was informed to the wildlife rescue team, they arrived and caught the snake.
#gurugram
#sumangautam
#indianrockpython
#snake


తెల్లవారు జామునే నిద్ర లేచి టీ పెడదామని కిచెన్‌లోకి వెళ్లింది సుమన్ గౌతమ్ అనే మహిళ. రోజూలానే లైటర్ తీసుకుని స్టవ్‌ను వెలిగించే ప్రయత్నం చేసింది. అప్పటికే ఏదో తెలియని శబ్దం తనకు వినపడుతోంది. ఏంటా శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని కిచెన్‌లో కలియతిరిగింది. వెంటనే షాక్‌కు గురైంది. కిచెన్‌లోకి అనుకోని అతిథి ప్రత్యక్ష్యమైంది. ఇంతకీ ఆ అతిథి ఎవరనుకుంటున్నారా... సుమన్ గౌతంను అంతలా భయపెట్టేలా చేసిన ఆ గెస్ట్ ఓ ఐదుడుగుల పెద్ద కొండచిలువ. వివరాల్లోకి వెళితే... గురుగ్రామ్‌ శీతల కాలనీలో సతీష్ కుమార్ గౌతమ్, సుమన్ గౌతమ్ అనే దంపతులు నివాసముంతుటున్నారు. సతీష్ చీకట్లోనే లేచి తన ఆఫీస్‌కు బయలుదేరాడు. భర్తను సాగనంపిన భార్య సుమన గౌతమ్ తిరిగి పడకపైకి చేరుకుని కాసేపు కునుకు తీసింది. ఆ తర్వాత నిద్ర లేచి...టీ చేద్దామని చెప్పి కిచెన్‌లోకి వెళ్లింది. అంతే అక్కడ కొండచిలువ నక్కి ఉండటాన్ని చూసి షాక్ నుంచి తేరుకోలేకపోయింది. గట్టిగా కేకలు వేద్దామా అంటే పాము తనపై దాడి చేస్తుందేమోనని భయపడింది. షాక్ నుంచి 10 నిమిషాలకు తేరుకున్న సుమన ఆఫీస్‌కు వెళ్లిన తన భర్తకు ఫోన్ చేసింది.