Pak's Shoaib Malik Joins Elite List After Achieving Rare ODI Double

  • 6 years ago
వయసు పెరుగుతోన్న కొద్దీ, తనలోని ఆట మరింతగా రాటుదేలుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి స్పిన్నర్‌గా అరంగేట్రం చేసిన అతడు పాకిస్థాన్ జట్టులో ఆల్ రౌండర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇంతకీ ఎవరా క్రికెటర్ అని అనుకుంటున్నారు.
భారత టెన్నిస్ సంచలనం సానియా మిర్జా భర్త షోయబ్ మాలిక్. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో షోయబ్‌ మాలిక్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బలవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 15 బంతుల్లో 18 పరుగులు సాధించాడు.
దీంతో వన్డేల్లో ఏడు వేల పరుగుల మార్కును చేరిన ఎనిమిదో పాకిస్తాన్‌ ఆటగాడిగా అరుదైన గుర్తింపు సాధించాడు. అదే సమయంలో మాలిక్ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో 7000లకు పైగా పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు సాధించిన ఏడో క్రికెటర్‌గా మాలిక్‌ నిలిచాడు.

Shoaib Malik became the second Pak player and 7th overall to reach the 7000 run-150 wicket double at the Queens Sports Club, Bulawayo in Zimbabwe. The veteran achieved this ' rare' double in the fifth and final ODI of the five-match series between Pak and Zimbabwe.
#pak
#zimbabwe
#shoaibmalik
#sachintendulkar
#cricket

Recommended