Ben Stokes In England ODI Squad For India Series

  • 6 years ago
The England all-rounder tore his hamstring ahead of the second Test against Pakistan earlier in June. He will make his return from injury in Durham's Vitality Blast opener against Hampshire on Thursday.
#cricket
#india
#england
#iccodichampionship
#benstokes
#indiainengland2018

విదేశీ పర్యటనలో భాగంగా ఐర్లాండ్ పర్యటన అనంతరం.. ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా ప్రకటించింది. తొడ కండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి వచ్చాడు.
ఇంగ్లాండ్ 5-0తో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే. స్టోక్స్ రాకతో ఇంగ్లీష్ జట్టుకు మరింత బలం చేకూరనుంది. ఒకవేళ స్టోక్స్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే భారత్‌తో జులై 8న బ్రిస్టోల్‌లో జరగనున్న మూడో టీ20కి ఇంగ్లాండ్ టీమ్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని ఈసీబీ పేర్కొంది. గాయం నుంచి కోలుకుంటున్న క్రిస్‌వోక్స్ సైతం ఫిట్‌నెస్ సాధించినైట్లెతే ఆఖరి వన్డేలకు జట్టులో చేరే అవకాశం ఉందని బోర్డు వెల్లడించింది.

Recommended