పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుమొఖం
  • 6 years ago
A peak tax rate of 28 per cent plus states levying some amount of local sales tax or VAT on petrol and diesel is likely to be the tax structure when the two auto fuels are covered under the GST regime, a top government official said.

పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటి ధరలు తగ్గుతాయని, వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిందేననే డిమాండ్లు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. వాటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అలా తెస్తే వాటి ధరలు ఎలా ఉంటాయనే దానిపై కేంద్రం బుధవారం స్పష్టతను ఇచ్చింది.
పెట్రోల్, డీజిల్ పూర్తిస్థాయి జీఎస్టీ కిందకు తీసుకు వచ్చినా, పూర్తిస్థాయిలో ఉండదని, 28 శాతం జీఎస్టీతో పాటు లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే మళ్లీ ప్రస్తుతం ఉన్న ధరలే ఉంటాయని చెబుతున్నారు. కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు అందుకు నో చెబుతున్నాయి.
దీంతో పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలకు వచ్చే ఆదాయం నష్టపోని రీతిలో ఈ పని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. పెట్రోల్‌పై దాదాపు అన్ని దేశాలు జీఎస్టీతో పాటు ఇతర పన్నులు వడ్డిస్తున్నాయి. ఇక్కడా ఆ పద్ధతినే అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడం వల్ల ఏటా రూ.20,000 కోట్ల కేంద్రం ఆదాయానికి గండి పడుతుంది. రాష్ట్రాలు కూడా భారీగా నష్టపోతాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం దగ్గరా నిధులు అందుబాటులో లేవు. ఈ సమస్యను అధిగమించేందుకు జిఎస్‌టి+వ్యాట్‌ విధించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఓ అధికారి వివరించారు. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
Recommended