Fifa World Cup 2018 : Croatia Makes Its First Win

  • 6 years ago
John Obi Mikel insists Nigeria must 'go back to the drawing board' following their 2-0 World Cup defeat to Croatia, but still harbours hopes the Super Eagles can progress from Group D.

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేషియా శుభారంభం చేసింది. దీంతో రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌లో తాము ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌లోనే క్రొయేషియా విజయం సాధించింది. గ్రూప్‌-డి మ్యాచ్‌లో క్రొయేషియా 2-0తో నైజీరియాను ఓడించింది.
నైజీరియా ఆటగాడు ఒగెనెకరో ఎటెబో చేసిన సెల్ఫ్‌ గోల్‌తో క్రొయేషియా ఆధిక్యం సాధించగా, ఆ తర్వాత 71వ నిమిషంలో కెప్టెన్‌ మోడ్రిక్‌ గోల్‌తో క్రొయేషియా 2-0తో ఆధిక్యాన్ని సాధించింది. ఆట 32వ నిమిషంలో అంటె రెబిక్, మరియో మండ్‌జుకిక్‌నుంచి బంతిని అందుకునే క్రమంలో కార్నర్ వద్ద అనూహ్యంగా ఎటెబో తమ గోల్‌పోస్ట్‌లోకే గోల్‌ కొట్టాడు.
దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి క్రొయేషియా 1-0తో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో క్రొయేషియా దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్లు డెజన్‌ లొవ్రెన్, ఒడియన్‌ ఇగాలో బంతిని నైజీరియా గోల్ పోస్టువైపే ఆడారు. ఈ క్రమంలో పలుమారుల్ గోల్స్ కొట్టేందుకు ప్రయత్నించినా ప్రత్యర్థి జట్లు డిఫెండర్లు వారిని నిలువరించారు.
ఫలితంగా 59వ నిమిషంలోగానీ నైజీరియా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ వద్ద గోల్‌గా మలచలేకపోయింది. ఆ తర్వాత నైజీరియా డిఫెండర్‌ విలియమ్‌ ట్రూస్ట్‌ ఎకాంగ్‌ కార్నర్‌ వద్ద క్రొయేషియా ఫార్వర్డ్‌ ఆటగాడు మరియో మండ్‌జుకిక్‌ను కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. ఆట 71వ నిమిషంలో మోడ్రిక్‌ దానిని గోల్‌గా మలచడంతో క్రొయేషియా 2-0తో విజయం సాధించింది.

Recommended