Chiranjeevi Decision To Ban Media Promotions..Goes Controversial

  • 6 years ago
other issues became headache for Tollywood since few days. In this situation, a team headed by Chiranjeevi, taken decision to ban few Telugu Television Channels. In this junxture Telugu Television channel slams Tollywood Heroes decision.
#Chiranjeevi
#Movie Artist Association
#Tollywoodheroes

టాలీవుడ్‌ను నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్, రాంగోపాల్ వర్మ వివాదం కుదిపేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అధ్వర్యంలో దాదాపు 25 మంది హీరోలు సమావేశమై టెలివిజన్ చానెళ్లను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నాయి. సినీ హీరోల నిర్ణయంపై ఓ టెలివిజన్ ఛానెల్ తీవ్రంగా స్పందించింది. సినీ హీరోలు తీసుకొన్న నిర్ణయాన్ని ఎండగట్టింది. సదరు టెలివిజన్ చానెల్లో ప్రసారమైనట్టు వస్తున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఆ వీడియో కథనం ఏమిటంటే..
సినిమాలు తీసేవాళ్లు న్యూస్, టెలివిజన్ ఛానెళ్లను బహిష్కరిస్తారట. సో ఇక నుంచి న్యూస్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వబోము అంటూ డజన్‌కు కథానాయకుల వేషాలు వేసేవాళ్లంతా హైదరాబాద్‌లో సమావేశమై నిర్ణయం తీసుకొన్నారు.
న్యూస్ ఛానెళ్లను బ్యాన్ చేద్దామనే నిర్ణయం మంచిదే. వీళ్ల హిపోక్రాటిక్ ప్రకటనలు, సొంత డబ్బాలు కొట్టుకునే ఇంటర్వ్యూలు. అలాగే నన్ను నీవు పొగుడు. నేను నిన్ను పొగుడుతా అనే ఆడియో ఫంక్షన్ల ప్రహసనాలు. మా కుటుంబం గొప్పది అంటే మా కుటుంబం గొప్పది అని వీరావేశంతో చెప్పుకొనే బెడద ప్రేక్షకులకు తప్పుతుంది. వాటిని భరించాల్సిన ఖర్మ తప్పుతుంది.
ఇక నుంచి తెలుగు హీరోలను మైనస్ పర్సనాలిటీలు అని పిలువాలి. ఆ హీరో, ఆ స్టార్, ఈ స్టార్ అనిపిలువవద్దు. వీరు చేసిందేంది బూడిద. ఎందుకు పనికిరాని బ్యాచ్. బయట కరెక్ట్‌గా ఎవడైనా వచ్చి లాగి గుద్దితే దేనికి పనికిరారు. తెర మీద చింపేసినట్టు వందమందిని చితకబాదేస్తుంటారు. ఇదీ వాళ్ల గొప్ప గొప్పతనం, డంబ ప్రయత్నాలు. ఇప్పటికైనా ఎదిగే ప్రయత్నం చేయండిరా నాయనా. సైక్రియాటిక్ కౌన్సిలింగ్‌కు అయినా వెళ్లండి. సమాజంలో మనుషులుగా బతుకుతున్నామా అని ఓ సారి ఆలోచించించుకొండి.

Recommended