Ntr Biopic : Mahesh Babu Play Superstar Krishna Role

  • 6 years ago
The much-awaited biopic on the life of late legendary actor and influential political figure NT Rama Rao was launched last month. Titled NTR, the film will have Nandamuri Balakrishna playing the role of NTR. Film Nagar source said that, Mahesh babu To Play SuperStar Krishna Role in NTR Biopic.

మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప చిత్రంగా తీర్చి దిద్దాలనే ఆలోచనలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు తేజ చేతికి అప్పగించిన ఆయన దీనికోసం భారీ తారాగణం ఎంపిక చేస్తున్నారు. మనం ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో చూడని భారీ తారాగణాన్ని ఇందులో చూడబోతున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఇంకా చాలా మంది స్టార్స్ ఇందులో భాగం కాబోతున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్‌లో మహేష్ బాబు కూడా భాగం కాబోతున్నారనే విషయం తెలిసినప్పటి నుండి ఆయన ఇందులో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆయన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నారట.
అంతే కాకుండా బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో ఆమె శ్రీదేవి పాత్రలో మెరవబోతోందట. జయలలిత పాత్రలో హీరోయిన్ కాజల్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషించబోతున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఇతర నందమూరి ఫ్యామిలీ నటులైన కళ్యాణ్ రామ్, తారక రత్నతదితరులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తారట. నారా రోహిత్‌ను కూడా ఓ ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడి పాత్రలో ప్రముక నటుడు రాజశేఖర్ కనిపించబోతున్నారట. ఇలా చాలా మంది స్టార్లు ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Recommended