Upasana Wished To Ramcharan In A Special Way
  • 6 years ago
Upasana Konidela's Special Birthday Wishes to Ram charan. Mega power star Ram Charan, who is waiting for Rangasthalam's release, will turn 33 on March 27.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. మార్చి 27, 1985లో జన్మించిన రామ్ చరణ్ నేటితో 33వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన సరికొత్త స్టైల్‌లో విష్ చేశారు.
ఉపాసన తన ప్రియమైన భర్తను 'మిస్టర్.సి' అని ముద్దుగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. మిస్టర్ సి అంటూ పూలతో గుమ్మంలో ముగ్గేసి వినూత్నంగా విష్ చేశారు ఉపాసన. అంతే కాదు... మిస్టర్ సి అని రాసి ఉన్న కొత్త చెప్పులను కూడా చెర్రీకి బహుబతిగా ఇచ్చారు
ఉపాసన బహుమతిగా ఇచ్చిన మిస్టర్.సి చెప్పులు వేసుకుని..... తన ముద్దుల భార్య వేసిన బర్త్ డే ముగ్గు ముందు నిల్చుని చరణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
'రంగస్థలం' చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ . బర్త్ డే దగ్గర్లో ఉన్నా ఎగ్జైట్మెంట్ లేదు ఏమీ లేదు. ఒక టెన్షన్ మాత్రమే ఉంది. బర్త్ డే సందర్భంగా ఎవరూ నా దగ్గరకు రాకండి, డైరెక్టుగా 30వ తేదీనే కలుస్తాను అని అందరికీ చెబుతున్నారంట.
Recommended