Renu Desai Opens Up On Her Second Marrige రేణు దేశాయ్ రెండోపెళ్లి..!

  • 7 years ago
When quizzed about the Divorce, Renu Desai said: 'I have not accepted any alimony from Pawan Kalyan after divorce. We maintain cordial relations even after separation.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు తాజాగా ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు. తన మోడలింగ్ డేస్, పవన్ కళ్యాణ్‌తో ప్రేమాయణం, విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఇలా చాలా విషయాలు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
మోడలింగ్ మొదలు పెట్టినపుడు నాకు నా మీద నమ్మకం లేదు. ఒక అబ్బాయి కూడా నా వైపు చూడటం లేదు నేను మోడల్ ఎలా అయ్యాను అనే ఫీలింగ్ ఉండేదు....
మోడలింగ్‌లో ఉన్నపుడూ ఎవరూ ప్రపోజ్ చేయలేదు. కళ్యాణ్ గారిని చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. ఇద్దరం అపుడు ఒకరినొకరం బాగా ఇష్టపడ్డామని,
సహజీవనం అంటే తొలుత చాలా భయం వేసింది. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నమ్మకం ఉండటం వల్లే ఆభయం పోయింది. అందువల్లే లివింగ్ టుగెదర్ సాధ్యమైంది...
ఎందుకు డైవర్స్ తీసుకున్నాను అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఏదో ఒక రోజు ఆ విషయం నా ఆటోబయోగ్రపీలో చెబతాను. అప్పటి వరకు చెప్పను.... అని రేణు దేశాయ్ తెలిపారు.
విడాకుల కారణం ఇపుడు చెబితే అనవసరంగా తలనొప్పి మొదలవుతుంది. అందుకే ఇపుడు మూతికి టేపేసుకుని నోరు మూసుకుని మౌనం పరం శీలం అని మిన్నకుండి పోతున్నాను... అని రేణు దేశాయ్ తెలిపారు.

Recommended