చిరంజీవి ఇంట్లో చోరీ..ఆ డబ్బుతో ఏం చేశాడో తెలుసా?

  • 7 years ago
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరుగడం ఫిల్మ్ నగర్లో సంచలనం అయింది. దాదాపు పదేళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న ఓ సర్వెంట్ ఇంట్లో లక్షలు దోచుకెళ్లాడనే విషయం తెలిసి అంతా నివ్వెర పోయారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా రూ. 16 లక్షల రూపాయలు ఇంట్లో పని చేసే చిన్నయ్య అనే వ్యక్తి దొంగిలించినట్లు పోలీసు విచారణలో తేలింది. చిరంజీవి ఇంటికి భారీ భద్రత, సీనీ కెమెరాల నిఘా ఉంటుంది. బయటి వ్యక్తులు ఎవరైనా లోనికి వస్తే ఇట్టే తెలిసి పోతుంది. అయితే తరచూ ఇంట్లో డబ్బు మాయం అవుతుండటంతో ఇంట్లో పని చేసే వారే ఈ పని చేస్తున్నారని గ్రహించారు. నిఘా పెట్టగా చిన్నయ్య అనే సర్వెంట్ డబ్బు దొంగిలిస్తూ దొరికిపోయాడు.
పోలీసు విచారణలో చిన్నయ్య రూ. 16 లక్షలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మొత్తాన్ని గడిచిన కొన్ని నెలలుగా దఫదఫాలుగా చోరీ చేసినట్లు అంగీకరించాడు.చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా పని చేస్తున్న చిన్నయ్య. నమ్మకమైన పని వాడిగా ఇంట్లో వుంటూ డబ్బు ఎక్కడ దాస్తారనే విషయాలు తెలుసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో, ఎవరి కంట పడకుండా డబ్బు దొంగిలించడం మొదలు పెట్టాడు.
చిన్నయ్య ప్రతి రోజూ ఎంతో కొంత డబ్బు నొక్కేసేవాడు. అయితే ఇటీవల భారీ మొత్తంలో రూ. 2 లక్షలు దొంగిలించడంతో దొరికిపోయాడు. అయితే చిన్నయ్య నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు.

Recommended